Wednesday, 25 January 2012

Question Corner: Fire and wind


MONDAY, JANUARY 23, 2012


Question Corner: Fire and wind

SHARE  ·   PRINT   ·   T+  
Wind blows out fire, at the same time it spreads fire. Why this phenomenon?
K.V.SANDEEPRajahmundry, Andhra Pradesh
Answer 1: Firstly, consider the presence of a low velocity wind. ( say, virtually, still air). At any moment of time, this wind is just sufficient to sustain the fire. That is, it functions just as an ‘element.'
Obviously, it cannot provide any motive force (kinetic energy) for the fire (flame). Hence, the fire cannot spread. Ultimately, it blows out. Secondly, consider the presence of a high velocity wind. At any moment of time, there is not only sufficient supply of air to sustain the fire but also there is adequate air to provide motive force.
Thus, its function is two-fold: as an element and as a motive force. Hence, the fire spreads.
K.N. KRISHNA PRASAD,
Guest faculty, Building Fire Research Centre
National Engineering Institute (Autonomous)
Mysore, Karnataka.
Answer 2: When we blow out a small candle we are trying to push the hot flame away from the fuel and the heat is removed away from the fuel and thus reaction of burning gets stopped.
For bigger fires the flame is bigger and more air is to be pushed quickly in order to push the fire away from the fuel.
But when air is blown gently on small flame, fresh supply of oxygen is pushed to it for the fuel to burn and the flame may also reach new fuel because of the blowing air that would normally be out of reach.
So depending on the size of the fire and how hard the air is blown the fire becomes worse or better. Thus if the fire is small enough blowing air will put off the fire.
For bigger fires blowing air may fan the flames adding more oxygen and the fire will grow and the flame may reach new fuels nearby causing these fuels also to burn.
R. GOPALAKRISHNAN,
Retired Scientist/Engineer, ISRO

This weeks Question

Why do we feel hungry very frequently during winter?
Prabhat KumarNew Delhi.
Keywords: firewindvelocity of wind

Hawking misses 70th birthday celebration


Hawking misses 70th birthday celebration

AP
SHARE  ·   PRINT   ·   T+  
In this December 2011 photo, Professor Stephen Hawking sits in his office at University of Cambridge.
APIn this December 2011 photo, Professor Stephen Hawking sits in his office at University of Cambridge.
Renowned physicist Stephen Hawking is not well enough to attend a conference held to celebrate his 70th birthday, a University of Cambridge official said on Sunday.
Prof. Hawking’s remarkable career is being honoured as part of a daylong conference on cosmology being hosted at the university.
But the celebrity scientist, who suffers from Lou Gehrig’s disease, will not be in attendance, according to Vice-Chancellor Leszek Borysiewicz.
Mr. Borysiewicz told conference attendees that Prof. Hawking was released from hospital on Friday and that “unfortunately his recovery has not been fast enough for him to be able to be here.”
He didn’t specify the nature of Prof. Hawking’s condition, although he said he believed Hawking would be well enough to meet some of the attendees over the next week.
Prof. Hawking uses a wheelchair and is dependent on a computerized voice system for communication.
Mr. Borysiewicz said he hoped that Hawking would follow the proceedings via videolink.
“If you’re listening Stephen, happy birthday from all of us here today,” Mr. Borysiewicz said to a round of applause.
Prof. Hawking was diagnosed with Lou Gehrig’s disease known as motor neurone disease in the U.K. when he was 21. Most people die within a few years of the diagnosis, but Hawking has defied the odds and gone on to revolutionize the field of theoretical astrophysics and become one of the best-known scientists since Albert Einstein.
An expert on black holes, Prof. Hawking also gained wide acclaim for popularising astronomy in best-selling books such as A Brief History of Timeand The Universe in a Nutshell.
Other speakers scheduled for Sunday include Astronomer Royal Martin Rees, Nobel Prize-winning physicist Saul Perlmutter, and Hawking’s longtime collaborator Kip Thorne. Among the topics due to be discussed are supernovae, black holes, and dark matter.

నీటికి రుచి లేదా?-విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 18 Jan 2012,


MONDAY, JANUARY 23, 2012


నీటికి రుచి లేదా? Share విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 18 Jan 2012, IST మా పాఠ్య పుస్తకాలలో 'నీరు' పాఠంలో నీటికి రంగు, రుచి లేనట్లు రాశారు. రంగు లేకపోయినా మనం తాగే నీరు కొంత రుచిగా అనిపిస్తుంది కదా! మరి నీటికి 'రుచి' లేదనడం ఎంతవరకు సబబు? - ఎ.భరత్‌, పొదలకూరు, నెల్లూరుజిల్లా స్వచ్ఛమైన నీటికి మాత్రమే రంగు, రుచి లేవు. మనం తాగే నీరు రసాయనికంగా స్వచ్ఛమైనది కాదు. మన శరీరానికి నీటితో పాటు పలురకాలైన లవణాలు (minerals) కూడా అవసరం. ఉదాహరణకు మన మెదడు, నాడీ మండలం, కణజాలాల మధ్య పదార్థాల రవాణా (material transport) వగైరా పనులన్నీ వివిధ లోహ అయాన్ల (metal ions) సమక్షంలో జరుగుతాయి. ఉదాహరణకు నాడీతంత్రుల మధ్య సమాచార సరఫరా (communication propagation) లో సోడియం (Na+), పొటాషియం (K+) క్లోరైడు (Cl-) వంటి అయాన్ల ప్రమేయం అధికంగా ఉంటుంది. ఈ అయాన్లు అసమానంగా కణాల మధ్య పేరుకుపోయినపుడు ఏర్పడే విద్యుత్‌ పొటెన్షియల్‌ ఓ సంకేత రూపంలో నిలువ ఉంటుంది. తిరిగి ఈ అయాన్ల గాఢత సమానమయినపుడు ఆ సంకేతం పక్క కణానికి చేరుతుంది. ఇలా పదే పదే అయాన్ల గాఢతల మధ్య అసమాన, సమానత్వాలు రావడం వల్లే మెదడు నుంచి కణజాలాల (tissues) వరకూ సంకేతాలు (signals) చేరతాయి. మన రక్తంలో ఎర్ర రక్తకణాలలోని ఇనుము అయాను ఎంతో విశిష్టమైంది. మనం పీల్చిన గాలిలోని ఆక్సిజన్‌ హీమోగ్లోబిన్‌లోని ఇనుము అయానుతోనే సంధానించు కొంటుంది. అది రక్తప్రసరణ ద్వారా కణాలను చేరినపుడు అక్కడ మయోగ్లోబిన్‌లో ఉన్న ఇనుము అయానుకు బదలాయించు కొంటుంది. ఆ తదుపరి సైటోక్రోమ్‌ - c - ఆక్సిడేజ్‌ అనే మరో లోహ ప్రోటీను సమక్షంలో ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ అయాన్లు కలిసి నీటి ఆవిరిగా మారే క్రమంలో శక్తి విడుదలవుతుంది. ఆ శక్తినీ మనం గ్రహించి, వివిధ జీవధర్మాలను చేయగలుగుతున్నాము. ఇప్పుడు మీరు ప్రజాశక్తి చదువుతున్న సందర్భంలో మీ కంటిలోనూ, మెదడులోనూ సైటోక్రోమ్‌ - c - ఆక్సిడేజ్‌కి పని పడిందన్న మాట. ఈ సైటోక్రోమ్‌ - c - ఆక్సిడేజ్‌లో జింకు, ఇనుము, కాపర్‌ అయాన్లు ఉంటాయి. ఇలా ఎన్నో అయాన్లు మన శరీరంలో తమ తమ వంతు కర్తవ్యాలను నిర్వహించడంవల్లే మనం సజీవంగా ఉన్నాము. మరి ఈ అయాన్లు మన శరీరంలోకి ఎలా వెళ్లాలి? మన తినే ఆహారంలోను, కాయగూరల్లోను, పండ్లల్లోను కొంతమేరకు పలురకాల అయాన్లు ఉన్నా ఎక్కువ శాతం అయాన్లు తాగే నీటి ద్వారానే శరీరానికి అందుతాయి. కాబట్టి స్వచ్ఛమైన నీరు (pure water) మనకు దాహాన్ని తీరుస్తుందేగానీ ఉపయుక్త మైన లవణాలను అందించలేదు. అందు వల్ల మనం తాగేనీటిలో కృత్రిమంగాగానీ లేదా సహజంగాగానీ కొన్ని లవణాలు ఉండేలా చూస్తాము. ఇలా లవణాలు కరిగిననీరు కాబట్టే అలాంటి నీటికి కొంత రుచి ఉన్నట్టు తోస్తుంది. వివిధ ప్రాంతాల్లోని నీటిలో వివిధ రకాలయిన సహజ లవణాలు పలు మోతాదుల్లో ఉండడం వల్ల ప్రాంతాలను బట్టి తాగునీటి రుచి మారుతుంది. లవణాలు తగురీతిలో ఉండాలన్న నిబంధనను అనుసరించే మనము ప్రభుత్వాలను రక్షిత మంచినీరు (safe drinking water) సరఫరా చేయాలని అడుగుతున్నాం. కానీ ప్రభుత్వాలు చేతులెత్తేయడం వల్ల బహుళజాతి కంపెనీలు, దగా కంపెనీలు, బూటకపు కంపెనీలు మినరల్‌ వాటర్‌ అంటూ ప్రజల నుంచి కోట్లు దండుకుంటున్నాయి.

స్క్రూగేజి కనీస కొలత అంటే ?- పదో తరగతి భౌతికరసాయన శాస్త్రం

స్క్రూగేజి కనీస కొలత అంటే ? Share జి.బాలసుబ్రహ్మణ్యం Thu, 12 Jan 2012, IST పదో తరగతి భౌతికరసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం-బేధాలకు సంబంధించిన ప్రశ్నలు 1. ఆల్ఫా, బీటా, గామా, కిరణాల మధ్య తేడాలు రాయుము. 2. ద్రవ్యరాశి, భారానికి గల తేడాలు రాయండి. 3. డయా, పారా, ఫెర్రో అయస్కాంత పదార్థాల మధ్య తేడాలు రాయండి. 4. సూర్య కేంద్రక సిద్ధాంతం, భూకేంద్రక సిద్ధాంతం మధ్య గల తేడా రాయండి. 5. అభికేంద్ర బలం, అపకేంద్ర బలానికి మధ్య తేడాలు రాయండి. 6. పురోగామి తరంగాలు స్థిరతరంగాలు మధ్య తేడాలను రాయండి. 7. న్యూటన్‌ కణ సిద్ధాంతం, హైగెన్స్‌ తరంగ సిద్ధాంతముల తేడాలను రాయండి. 8. సాధారణ కాంతికి, లేజర్‌ కాంతికి గల బేధాలను వివరించండి. 9. సహజ రేడియో ధార్మికత, కృత్రిమ రేడియో ధార్మికతల మధ్య తేడాలను రాయండి. 10. Aజ, ణజ లతో పనిచేసే మోటారులలో తేడాలను వివరించండి. 11. గురుత్వ త్వరణానికి, విశ్వ గురుత్వ స్థిరాంకానికి మధ్య గల సంబంధాన్ని ఉత్పాదించండి. 12. యంత్ర భాష, ఉన్నత స్థాయి భాషల మధ్య తేడాలను రాయండి. 13. కంప్యూటర్‌లో హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లకు మధ్య గల తేడాలను రాయండి. ప్రయోగాలకు సంబంధించిన ప్రశ్నలు 1. రిపిల్‌ ట్యాంక్‌ ఉపయోగించి తరంగాల పరావర్థనం మరియు వక్రీభవనాన్ని వివరింపుము. 2. ఫారడే రెండవ విద్యుత్‌ విశ్లేషణ నియమాన్ని ప్రయోగం ద్వారా వివరించండి. ఏవేని రెండు విద్యుత్‌ విశ్లేషణ అనువర్తనాలను రాయండి. 3. రూథర్‌ఫర్డ్‌ ఆల్ఫా కణాల పరిక్షేపణం చూపు పటాన్ని గీచి దాని ప్రాముఖ్యతను ప్రస్తావించండి. 4. పటం ద్వారా రేడియో ప్రసారంలో వివిధ దశలను వివరించడం. 5. లఘు లోలకంతో ఒక ప్రాంతపు గురుత్వ త్వరణాన్ని నిర్ధారించే ఒక ప్రయోగాన్ని వివరించండి. 6. గాలిలో ధ్వని వేగాన్ని తెలుసుకోవడానికి ఒక పద్ధతిని వివరించండి. 7. ఓమ్‌ నియమాన్ని రాసి, ఋజువు చేయడానికి ఒక ప్రయోగాన్ని వర్ణించండి. 8. కంప్యూటర్‌ యొక్క దిమ్మెల రూపు చిత్రాన్ని గీసి వివరించండి. 9. లేజర్‌ పనిచేసే విధానాన్ని వివరించండి. 10. న్యూక్లియర్‌ రియాక్టర్‌ ఏ సూత్రం పై ఆధారపడి పని చేస్తుంది. అది పనిచేయు విధానాన్ని వివరించండి. 11. ఈవింగ్‌ అయస్కాంత అణు సిద్ధాంతంలోని మౌలిక భావనలు ఏవి? దాని వైఫల్యానికి కారణాలు రాయండి. 12. స్క్రూగేజి ఉపయోగించి తీగ యొక్క వ్యాసము ఎలా కనుగొంటారు. 13. ుV ప్రసారంలోని వివిధ దశలను పటం ద్వారా వివరించండి. 14. ట్రాన్సిస్టర్‌ అనగా ఏమి? రెండు రకాల ట్రాన్సిస్టర్‌లను పటం ద్వారా విశదీకరించండి. ఉపయోగాలు మరియు ఇతర ప్రశ్నలు 1. సరళ హరాత్మక చలనం లక్షణాలు రాయండి. 2. లాండ్రి డ్రైయర్‌ పనిచేయు విధానాన్ని వివరించండి. 3. జంక్షన్‌ డయోడ్‌ యొక్క ధర్మాలు, ఉపయోగాలను రాయండి. 4. వాలు బయాస్‌లో, ఎదురు బయాస్‌లో పి-ఎన్‌ జంక్షన్‌ డయోడ్‌ చక్కని పటాలు గీయండి. 5. రోడ్డు మార్గాలకు గట్టుకట్టవలసిన అవసరం ఏమిటి? 6. విజ్ఞానపరంగా, సాంకేతికంగా లేజర్‌ యొక్క ముఖ్య అనువర్తణాలేవి? 7. ఉపకేంద్ర యంత్రం అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? 8. వైద్యరంగంలో లేజర్‌ ఉపయోగాలు 9. ఫారడే మొదటి, రెండవ విద్యుత్‌ విశ్లేషణ నియమాలను రాయండి. 10. జంక్షన్‌ ట్రాన్సిస్టర్‌ ధర్మాలు, ఉపయోగాలు రాయండి. ఐదు మార్కుల పటము (భౌతిక శాస్త్రం) 1. స్క్రూగేజి 2. దండాయస్కాంత ఉత్తరధ్రువం భౌగోళిక ఉత్తర దిశలో ఉంచినప్పుడు అయస్కాంత బల రేఖలను గీచి తటస్థ బిందువులను గుర్తించండి. 3. టి.వి. ప్రసారం మరియు రేడియో ప్రసారం పటాలు. 4. న్యూక్లియర్‌ రియాక్టర్‌ 5. దండాయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం, భౌగోళిక ఉత్తర ధ్రువాన్ని చూస్తున్నప్పుడు ఏర్పడే బలరేఖల పటాన్ని గీయండి. తటస్థ బిందువులను గుర్తించండి. 6. ఉష్ణ యాంత్రిక తుల్యాంకము కనుగొను ప్రయోగంలో పరికరముల అమరికను గీయండి. 7. విద్యుత్‌, అయస్కాంత్‌ వర్ణపటం గీచి వివిధ తరంగాల తరంగధైర్ఘ్యాలను గుర్తించండి. 8. ట్రాన్స్‌ ఫార్మర్‌ పటం 9. విద్యుత్‌ మోటార్‌ పటం 10. డైనమో పటం రసాయన శాస్త్రం 11. ఆల్కాహాల్‌ తయారీలో గల పరికరాల అమరికను చూపు పటం గీచి భాగాలు గుర్తించండి. 12. స-ఆర్బిటాళ్లు, జూ-ఆర్బిటాళ్లు ర-ఆర్బిటాల్‌ 13. చక్కెర పరిశ్రమలో చెరకు, నుండి చక్కెర తయారు చేయు పటం, 14. నూనెల హైడ్రోజనీకరణం 15. సిమెంట్‌ తయారీ 16. మెగ్నీషియంను దాని ధాతువు నుండి సంగ్రహించడాన్ని సూచించే పటాన్ని గీచి భాగాలను గుర్తింపుము. 17. నైట్రోజన్‌ అణువుతో త్రిక బంధం ఏర్పడుటను సూచించే రేఖా చిత్రం గీయండి. 18. ఆక్సిజన్‌ అణువుతో ద్విబంధం ఏర్పడుటను సూచించే రేఖా చిత్రం గీయండి. 19. ఆర్బిటాళ్ల వివిధ శక్తిస్థాయిలను తెలుపు అయిలర్‌ పటమును గీయండి. 20. ష్ట్రషశ్రీ అణువు ఏర్పడు ఆర్బిటాళ్ల అచ్చాదన పటం గీయము. 21. సిగ్మా బంధం, పై బంధాలను ఏర్పడు విధానం తెలుపు పటాలను గీయండి. 22. డైమండ్‌, గ్రాఫైట్‌ పటాలను గీయండి. 1 మార్కు ప్రశ్నలు - భౌతిక శాస్త్రం 1. 20 మీ. ఎత్తునుండి పడే వస్తువు భూమిని తాకినపుడు దాని వేగమెంత? 2. అనునాదం నిర్వచించండి. 3. అయస్కాంత భ్రామకం అనగా ఏమి? 4. ఐసోటోప్‌లు అంటేఏమిటి? ఉదాహరణలు ఇమ్ము. 5. ఐసోబార్‌లు అంటే ఏమిటి? 6. ఐసోటోన్‌లు అంటే ఏమిటి? ఉదాహరణ ఇమ్ము. 7. సూర్యకేంద్రక సిద్ధాంతం అనగా ఏమి? 8. ఒక బంతిని పైకి విసిరినప్పుడు అది చేరిన గరిష్ఠ ఎత్తు 80 మీ దాని తొలివేగమెంత? 9. ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడానికి కావల్సిన నియమం ఏమిటి? 10. రేడియో ధార్మిక విఘటన నియమాన్ని రాయండి. 11. హుక్‌ సూత్రాన్ని రాయండి. 12. ద్రవ్యరాశి లోపాన్ని నిర్వచించండి. 13. బైట్‌ అనగాఏమి? 14. రేడియోగ్రఫీ అంటే ఏమిటి? 15. లెంజ్‌ నియమాన్ని నిర్వచించండి. 16. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏ సూత్రమాధారంగా పని చేస్తుంది. 17. బంధన శక్తి అంటే ఏమిటి?; 18. జూ-అ-జూ ట్రాన్సిస్టర్‌ సంకేతాన్ని గీయండి. 19. కఠిన ఞ- కిరణాల ఉపయోగమేమిటి? 20. స్క్రూగేజి కనీసపు కొలత అనగా ? 21. అనునాదానికి నిత్య జీవితంలోని రెండు ఉదాహరణలను రాయండి. 22. హీలియం న్యూక్లియర్‌ పటం గీయండి. 23. స్క్రూగేజి శూన్యాంక దోషాలు పటం గీయండి. 24. నిత్య జీవితంలో మీకు తెలిసిన డోలాయమాన చలనాలకు ఉదాహరణ ఇవ్వండి. 25. వాతావరణంలోని ఓజోన్‌ పొర క్షిణించడానికి కారణాలు ఏమి? 26. గమన కాలం అనగానేమి? 27. స్థావర తరంగాలు పటం గీయండి. 28. ఒక సాధారణ విద్యుత్‌ పటం గీయండి. 29. పరమాణు సంఖ్య మరియు పరమాణు ద్రవ్యరాశికి గల బేధమును రాయము. 30. మాదీకరణం అనగా ఏమిటి? 31. విద్యుత్‌ అయస్కాంత తరంగం పటం గీయండి. 32. కృత్రిమ పరివర్తన అంటే ఏమిటి?

పారాసిటమాల్‌ నిర్మాణం గీయండి ? పదో తరగతి భౌతికరసాయన శాస్త్రం

పారాసిటమాల్‌ నిర్మాణం గీయండి ? పదో తరగతి భౌతికరసాయన శాస్త్రం Share దీపిక డెస్క్ : జి.బాలసుబ్రహ్మణ్యం Thu, 19 Jan 2012, IST రసాయన శాస్త్రం 33. PH అనగా ఏమి? 34. సెఫానిఫికేషన్‌ అనగా ఏమి? 35. పౌలీవర్జన నియమం అనగా ఏమి? 36. ప్లాంక్‌ సమీకరణం రాయండి? 37. సూక్ష్మ ఎరువుల ఉపయోగాలేమి? 38. 3P ఆర్బిటాల్‌ నిండిన తరువాత ఎలక్ట్రాన్‌ 4-S లో ప్రవేశించును. 3D లో ప్రవేశించదు ఎందుచేత? 39. ఎప్సం లవణంలో ఎన్ని నీటి అణువులు ఉన్నాయి? 40. ఏవేని రెండు క్రోమోఫోర్లు పేర్లు రాయండి? 41. జిగుర్లు అనగా ఏమి? 42. నీటి అయానిక లబ్ధం అంటే ఏమిటి? గమనిక:- పరమాణు నిర్మాణంలోని మొదటి 30 మూలకాలు ఎలక్ట్రాన్‌ విన్యాసం రాయటం నేర్చుకొనినచో 2 మార్కులు లేదా ఒకమార్కు లేదా ఆబ్జెక్టివ్‌ల యందు బాగా ఉపయోగపడతాయి. 43. రూపాంతరత అంటే ఏమిటి ? 44. సల్ఫిటేషన్‌ అనగా ఏమి? 45. ఆమ్లాలకు క్షారాలకు గల రెండు భేదాలు రాయండి ? 46. కాటనేషన్‌ నిర్వచించండి? 47. నోడల్‌ తలము అనగా ఏమి ? 48. పిరమిడ్‌ ఆకృతిగల రెండు అణువులను పేర్కొనండి ? 49. నూనెల హైడ్రజీనీకరణం వల్ల లాభాలేమిటి? 50. అనార్థ్ర Mgcl2 ను విద్యుత్‌ విశ్లేషణ చెందించేటప్పుడుKcl, Nacl లను ఎందుకు కలుపుతారు ? 51. ఆస్ట్రిన్‌, పారాసిటేమాల్‌ల నిర్మాణాలను గీయండి ? 52. 0`001 m Hcl యొక్క PHని కనుక్కోండి ? 53. మేండలీఫ్‌ ఆవర్తన పట్టిక ఏ నియమంపై ఆధారపడింది. 54. గడ్డం చేసుకొనేప్పుడు వాడే సోపు ఎందుచేత ఆరిపోయి నురుగ నిస్తుంది? 55. ఆక్సీకరణం అంటే ఏమిటి? 56. H+, [H+] మధ్య తేడా రాయండి స్థిర కక్ష్య అంటే ఏమిటి? 57. ధ్రువ, అధ్రువ ద్రావణికి ఒకొక్క ఉదాహరణ రాయండి ? 58. Pcl5 అణువు ఆకృతి పటం గీయుము? 59. మోస్లే ఆవర్తన నియమం రాయండి. 60. నీటి అణువు ఆకృతి పటం గీయండి ? 61. కాటనేషన్‌ అనగా ఏమి? రసాయన శాస్త్రము నుండి 2/4 మార్కులకు ముఖ్యమైన ప్రశ్న 1. బోర్‌ పరమాణు నమునా అందలి లోపాలు ? 2. రూథర్‌ ఫర్డ్‌ పరమాణు నమునా, అందల లోపాలు ? 3. ప్రధాన క్వాంటమ్‌ సంఖ్య, ఎజిముంతల్‌ క్వాంటమ్‌ సంఖ్య, అయస్కాంత క్వాంటమ్‌ సంఖ్య, స్పిన్‌ క్వాంటమ్‌ సంఖ్యలను సంక్షిప్తంగా వివరించుము ? 4. సమన్వయ సమ యోజనీయ బంధం అనగా ఏమి? ఒక ఉదాహరణను వివరించుము ? 5. ద్విబంధం ఏర్పడు విధమును ఒక ఉదాహరణ ద్వారా వివరించుము ? 6. నైట్రోజన్‌ నందు త్రిబంధం ఏర్పడు విధానమును వివరించుము ? 7. వివిధ రకాల ఆర్బిటాళ్ల అతి పాతమును ఉదాహరణలతో వివరించండి. 8. సిగ్మా బంధం, పై బంధానికి మధ్య గల తేడాలను రాయండి. 9. పొడవైన ఆవర్తన పట్టిక లక్షణాలను రాయండి. 10.2 మోల్‌లNa2Co3ని 3 మోల్‌ల నీటిలో కరిగించగా ఏర్పడు ద్రావణం యొక్క ద్రావితం ద్రావణి మోల్‌భాగాలను కనుక్కోండి. 11. అర్హీనీయస్‌ ఆమ్లక్షార సిద్ధాంతం, అందలి లోపాలను రాయండి. 12. ఈ క్రింది వాటిని నిర్వచించండి. ఎ) అయనీకరణ శక్మం బి) ఎలక్ట్రాన్‌ అఫినిటీణు వ్యాసార్థం సి) న్యూలాండ్స్‌ అష్టక సిద్ధాంతం ఇ) అంతర పరివర్తన మూలకాలు ఎఫ్‌) పరివర్తన మూలకాలు 13. 10 గ్రాముల సోడియం కార్బనేట్‌ 120 గ్రాముల జలద్రావణంలో కరిగి ఉంది. దాని భారశీలాన్ని కనుగొనండి. 14. ఆమ్లాల రెండు రసాయన ధర్మాలను సమీకరణములతో రాయండి 15. క్షార మృత్తిక లోహాలని వేటిని అంటారు. అవి : ఎ) నీరు బి) ఆక్సిజన్‌ సి) క్లోరిన్‌ లతో ఏ విధంగా చర్యనొందుతాయో వివరించండి. 16. 0.1 m Na2Co3 100 ml. 100 ఎశ్రీ. ప్రామాణిక ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేస్తారు. 17. ఆల్కేన్‌లని వేటిని అంటారు? ఆల్కేన్‌ల ప్రతిక్షేపణ దహన చర్యలను రాయండి. 18. 750 50 ml. \ 0.4 mసోడియం హైద్రాక్సైడ్‌ (NaOH) ద్రావణంలో వున్న NaOH మోల్‌ల సంఖ్యను లెక్కించండి ((NaOH అణుభారం 40) 19. పొలిమెరీకరణం అనగా ఏమి? 20. పిరమిడ్‌ మరియు గ్రూపులలో క్రింది నియమాలు ఏ విధంగా మారతాయో వివరించండి. ఎ) పరమాణు పరిమాణం బి) ఋణవిద్యుదాత్మకత సి) ధన విద్యుదాత్మకత డి) అయనీకరణ శక్మం ఇ) ఆక్సీకరణ, క్షయ కరణ ధర్మాలు 21. అయనీకరణ శక్మాన్ని నిర్వచించి దాన్ని ప్రభావితం చేయు అందేలను అందులను వివరించండి. 22. డైమాండ్‌, గ్రాఫైట్‌ల నిర్మాణాలను సరిపోల్చండి. 23. బెనడిక్ట్‌ ద్రావణాన్ని తయారు చేయు విధానాన్ని వివరించండి. 24. 45 మి.లీ.ల హెప్టీనుకు 15 మి.లీ హెక్సేన్‌ ను కలిపి నపుడు ఏర్పడిన ద్రావణపు ఘన పరిమాణ శాతాన్ని లెక్కించండి. 25. తటస్థీకరణోష్ణము అంటే ఏమిటి? బలమైన ఆమ్ల క్షార చర్యకు దీని విలువెంత? 26. ఆల్కేనుల ఆల్కేనుల మద్య బేధాలు ఏవి? 27. మోలారిటీని నిర్వచించండి. 250 మి.లీల సోడియం క్బానేట్‌ జల ద్రావణంలో 2.12 గ్రా.ల Na2Co3 ఉన్నట్లయితే, ఆ ద్రావణపు మొలారిటీని లెక్కించండి. (Na2Co3 అణుభారం= 106) 28. అంశిక స్వేదనము అనగా ఏమి? పెట్రోలియం అంశిక స్వేదనమును వివరించండి. 28. నూనెల హైడ్రజనీకరణం వల్ల లాభాము లేవి? 30. ఎమినో ఆమ్లాలని వేటిని అంటారు ? రెండు ఉదాహరణలు ఇవ్వండి. 31. క్రింది వాటిని నిర్వచించి ప్రతిదానికి రెండు చొప్పున ఉదాహరణ లివ్వండి? ఎ) శరీర సౌందర్య సాధనం బి) ఔషధము. 32. సబ్బు యొక్క లక్షణాన్ని ఎలా పరీక్షిస్తారు. 33. మందు అనగా ఏమి? చికిత్సాచర్య ఆధారంగా మందులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు. 34. మందును నిర్వచించండి. ఆదర్శమైన మందు లక్షణాలను రాయండి. 35. హుండ్స్‌ నియమాన్ని తెల్పి సోదాహరణంగా వివరించండి. 36. అఫ్‌బౌ నియమాన్ని తెల్పి సోదాహరణంగా వివరించండి. 37. చెరకు నుండి చక్కెరను ఉత్పత్తి తెల్పండి ఈ ప్రక్రియలో ముఖ్య ఉత్పన్నాన్ని దాని ఉపయోగాలను రాయండి. 38. ఈ క్రింది పదాలను నిర్వచించండి ఎ) బలమైన ఆమ్లం బి) బలహీన ఆమ్లం సి) బలమైన క్షారం డి) బలహీనక్షారం రెండేసి ఉదాహరణలు రాయండి. 39. ప్రొటీన్‌లు అనగా ఏమి? పెప్టైడ్‌ బంధం ఎలా ఏర్పడుతుంది. ప్రొటీన్‌ల ముఖ్య విధులను తెల్పండి. 40. ఈ క్రింది వానిపై లఘు వ్యాఖ్యనా రాయండి ఎ) కృత్రిమ జిగుర్లు ఉపయోగాలు బి) సాధారణ కుండ పాత్రలు - మృణ్మయ పాత్రలు

మాయలు మహిమల బండారం

మాయలు మహిమల బండారం Share 6 విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 30 Nov 2011, IST మాయలు, మహిమల పేరుతో కొంత మంది బాబాలు, స్వామీజీలు మోసం చేస్తుంటా రు. వాటినిచూసి వారి దగ్గర ఏదో అతీంద్రీయశక్తులు ఉన్నాయని నమ్మి మోసపోతుంటాం. మహిమల వెనుకున్న గుట్టు, రహస్యాలు తెలియనంతకాలం వాళ్ళ దగ్గరేవో శక్తులున్నాయని అనుకుంటాం. తెలిసిన తరువాత 'ఇంతేనా' అనుకుంటాం. అలాంటి మాయల రహస్యాలను, దానిలో ఇమిడి వున్న శాస్త్రవిజ్ఞానాన్ని కొన్నింటిలో పరిశీలిద్దాం. నిప్పుల మీద నడక.. కొంతమంది నిప్పుల మీద నడుస్తారు. మహిమ వలన కాలదని చెపుతారు. మహిమ గల వారే నడవాలని చెపుతారు. నిజంగా మహిమకలవారే నడవాలా? ఎవరైనా నడవవచ్చు. ఇందుకు ఏ మహిమా అవసరం లేదు. సైన్స్‌ తెలిసుంటే చాలు. ఏ పదార్థానికైన కొన్ని ధర్మాలుంటాయి. ఏ వస్తువు పొయ్యి మీద పెట్టగానే వేడెక్కదు. అందుకు కొంత సమయం పడుతుంది. అలాగే మన కాలు నిప్పుమీద పెట్టగానే వెంటనే కాలదు. కొన్ని సెకన్ల సమయం పడు తుంది. నిప్పుమీద కాలు ఆనగానే కొంత భయం ఏర్పడుతుంది. దానివలన చెమ టపడుతుంది. అందువలన కాలదు. అయితే ఆ కొద్ది సెకన్ల కాలంలోనే మనం అడుగుతీసి అడుగువేయాలి. అందుకు నిప్పులపై వేగంగా నడవాలి. అంతేకానీ మాయ మహిమ అనేవేమీ లేవు. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనుభవజ్ఞు లైన వారు లేకుండా ప్రయత్నించరాదు. నిప్పుల మీద బూడిద లేకుండా చూసు కోవాలి. వేగంగా నడవాలి. భయపడి మధ్యలో ఆగరాదు. ధైర్యంగా ఉండాలి. నీటితో మంటలు.. ఒక స్వామీజీ నా మహిమ చూడండి నేను నీటితో మంటలను మండిస్తానని చెప్పాడు. అందరు ఎలా మండిస్తాడోనని చూస్తున్నారు. నడవండని అందరినీ బయటకు తీసి కెళ్ళాడు. కాసేపు అటూ ఇటూ తిప్పి ఆగండి అన్నాడు. మీ దగ్గర ఎవరి దగ్గరన్నా నీళ్ళున్నాయా? అని అడిగాడు. ఒకరిద్దరు తమ దగ్గరున్న నీళ్ళ బాటిల్స్‌ ఇవ్వబోయారు. మీరే ఆ నీళ్ళను ఈ భూమిపై పోయమని చెప్పాడు. వాళ్ళు అలాగే పోశారు. వెంటనే ఒక అగ్గిపుల్లతో అక్కడ మంట పెట్టాడు. ఆశ్చర్యం మంట వస్తుంది. నీళ్ళుపోస్తున్న కొద్దీ పెరుగుతుందే కానీ తగ్గడంలేదు. చూశారా నా మహిమ అంటూ అందరివైపు ఒక్కసారి చూశాడు. అంతే అందరూ 'స్వామీ!' అంటూ ఆయన కాళ్ళమీద పడ్డారు. ఈ మహిమ ఏంటో చూద్దామని వెళ్ళాం. పరిశీలన తరువాత మాకు తెలిసింది ఏమిటంటే ముందుగానే ఆ భూమిలో కాల్షియంకార్బైడ్‌ అనే రసాయనాన్ని అతని సహాయకులు ఉంచారు. అక్కడికి రాగానే వారు సైగ చేశారు. అక్కడే నీళ్ళు పోయమన్నా డు. నీళ్ళు పోయగానే రసాయన ప్రక్రియ జరిగి ఎసిటిలీన్‌ అనే వాయువు విడుదలవుతుంది. ఈ వాయువుకు మండే లక్షణం ఉంది. అందుకే మండించగానే ఈ వాయువు మండుతుంది. నీళ్ళు పోస్తున్న కొద్దీ వాయువు వస్తుంది. మంట మండుతూనే ఉంటుంది. ఇళ్లు తగలబడడం.. ఊర్లో ఎవరో చేతబడి చేశారని, మంత్రాలు చేశారని ఇళ్లు తగులబడుతున్నాయని అనేకసార్లు పత్రికల్లో వార్తలు చూస్తున్నాం. ఇలాంటి అనేక గ్రామాలను జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు పరిశీ లించడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో పచ్చభాస్వరం అనే రసాయన పదార్థాన్ని వినియో గిస్తారని గుర్తించాం. పచ్చభాస్వరంను నీటిలో భద్రపరుస్తారు. నీటిలో నుండి బయటకు తీయగానే భగ్గున మండుతుంది. దీనిని తడిగుడ్డలో చుట్టి ఇళ్ల మీద పడేస్తే లేదా చూరులో పెడితే తడి ఆరిన తరువాత పచ్చభాస్వరం మండుతుంది. ఆ మంటతో ఇళ్లు తగలబడతాయి. ఇదీ దీనిలోని అసలు సంగతి. అంతేగానీ చేతబడి, మంత్రాలు కారణంకానే కాదు.

మూఢనమ్మకాలు ఎందుకున్నాయి?

మూఢనమ్మకాలు ఎందుకున్నాయి? శాస్త్ర విజ్ఞానం ఒకేలా ఉన్నా అందరూ హేతువాదులు కాదు ఎందుకు? Share విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 23 Nov 2011, IST మూఢ నమ్మకాలు ప్రజల్లో ఎందుకుంటాయి? శాస్త్రవిజ్ఞానం ఒకేవిధంగా ఉన్నా అందరూ ఎందుకు హేతువాదులు కాదు? తాను అనుకున్న దానినే గుడ్డిగా (మూర్ఖంగా) నమ్మే వ్యక్తికి మూఢనమ్మకం ఉందంటాము. ఎవరూ పనిగట్టుకొని గుడ్డిగా దేన్నీ నమ్మరు. ఏదో ఒక హేతువు ఆధారంగానే మూఢ నమ్మకస్తుడూ నమ్ముతుంటాడు. కాబట్టి ప్రపంచంలో ఎవరూ పదహారణాల మూఢనమ్మక స్తులు కాదు. అదేవిధంగా విశ్వాసానికి, నమ్మకానికి ఆధారాన్ని ఆపాదించుకునే వ్యక్తిని హేతువాది అంటాము. ఈ ప్రపంచంలో ఏ ఆధారమూ, ఏ హేతువూ లేకుండా ఏ వ్యక్తీ ఒక నమ్మకాన్ని ఏర్పర్చుకోడు. అంటే అర్థం ఏమి టంటే వైద్యపరంగా పిచ్చివాళ్లు తప్ప ఆరోగ్యంగా ఉన్న ప్రతివ్యక్తీ ఏదోవిధంగా హేతువాదే! మరి ఎందుకని కొందర్ని హేతువాదులనీ మరి కొందర్ని (నిజం చెప్పాలంటే ప్రజానీకంలో అధికభాగంగా ఉన్నవారిని) మూఢనమ్మ కస్తులనీ, ఛాందసవాదులనీ, అంధవిశ్వాసులనీ ముద్ర వేస్తున్నాము? కేవలం శాస్త్రం ఆధారంగా ఏర్పడ్డ హేతువాద దృక్పథపు మోతాదుకూ, అశాస్త్రీయ ఆధారాలతో ఏర్పడ్డ నిర్హేతుక నమ్మకాల మోతాదుకూ ఉన్న నిష్పత్తిని బట్టే కొందరు హేతువాదులుగానూ, మరికొందరు ఛాందసవాదులుగానూ పరిగణింపబడుతున్నారు. నిజమైన హేతువాదులు పరస్పర విరుద్ధమైన అభిప్రాయా లతో ఉండరు. పరస్పర విరుద్ధ ఆధారాలపైన తమ నమ్మకాల్ని నిలబెట్టుకోరు. కానీ నిర్హేతుకవాదులు, మూఢనమ్మకస్తులకు హేతువు ఉంటుందిగానీ ఆ హేతువులు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. మూఢవిశ్వాసంలో ఉన్నవాడు కూడా కొంత దూరం హేతువుతో వెళతాడు. కానీ ఈయనకు నిన్న ఒక హేతువు, నేడు ఒక హేతువు, సమయానుకూల హేతువులు ఉంటాయి. ఉదా: కింది సంభాషణ గమనించండి. అద్భు తాల్ని గట్టిగా విశ్వసించే ఒకవ్యక్తి (అద్భుతాల విశ్వాసి) సంధించిన ప్రశ్నలకు ఒక మూఢవిశ్వాసి, ఒక హేతువాది ఎలా స్పందిస్తారో కింది ఉదాహరణలో గుర్తించండి. అద్భుతాల విశ్వాసి : రాయి నీళ్లలో ఎందుకు మునిగింది? (ప్రశ్న) మూఢ విశ్వాసి : బరువున్నవి నీళ్లలో మునుగుతాయి. తేలికైనవి తేలతాయి. (హేతువు) అద్భుతాల విశ్వాసి : మనిషి మునుగుతాడా? (ప్రశ్న) మూఢ విశ్వాసి : మునుగుతాడు. ఆ మధ్య చాలామంది విద్యార్థులు గోదాట్లో ఈతకెళ్లి మునిగిపోయారు కదా! (హేతువు) అద్భుతాల విశ్వాసి : మనుషులందరూ దాదాపు ఒకటే కదా! అంటే శరీరధర్మాలు, శరీర నిర్మాణం మొదలైన విషయాల్లో! మూఢ విశ్వాసి : అవును. అందర్లోనూ రక్తం ఉంది. అందరూ అన్నమే తింటారు. కొందరు రాళ్లు తినరు. అందరూ కళ్లతోనే చూస్తారు. నోటితోనే తింటారు. కొందరు నోటితో, మరికొందరు చెవులతో భోంచేయరు కదా! (హేతువు) అద్భుతాల విశ్వాసి : మరి ఆ మధ్య మన ఊరి చెరువులో ఓ వ్యక్తి ఏమాత్రం ఈత కొట్ట కుండా, కాళ్లాడించకుండా, చేతులు కదిలించకుండా గంటసేపు నీళ్లపై వెల్లికిలా పడు కొని తేలాడుతూ ఉన్నప్పుడు మన ఊరి వారందరూ అతనికి గొప్ప నైవేద్యాలు ఇచ్చారు. మీరు కూడా అందులో ఒకరు. అతనెలా మునిగిపోలేదు? (కారణం ఏమిటన్న ప్రశ్న) మూఢ విశ్వాసి : అతనికి మహిమలున్నాయి. అతడు ప్రత్యేకం. అందరిలాంటివాడు కాదు. దైవాంశసంభూతుడు. అందుకే అందర్లా మునిగిపోకుండా తేలగలిగాడు. (ప్రశ్నకు సమా ధానం ఇవ్వడం హేతువే. ఆ మేరకు ఈ మూఢవిశ్వాసి హేతువాదే! కానీ అశాస్త్రీయమైన ఆధారాన్ని హేతువుగా భావించాడు). పై ప్రశ్నల్లో చివరిది తప్ప మిగిలిన ప్రశ్నలన్నింటికీ ఓ నిజమైన హేతువాది కూడా అవే సమాధానాలిస్తాడు. కానీ చివరి ప్రశ్నకు మాత్రం హేతువాది ఇలా జవాబిస్తాడు. ఇతనికి శాస్త్రం తెలియకపోవచ్చును. కానీ శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడు. హేతువాది: అలా తేలియాడుతున్న వ్యక్తులు నిజంగానే మిగిలిన వ్యక్తులతో పోలిస్తే భిన్నంగా ఉంటారు. మిగిలిన వ్యక్తుల్లాగా ఆ వ్యక్తులు మునిగిపోకుండా తేలుతూ ఉండడం కూడా నిజమే. కానీ అందుకు కారణం వాళ్లకి మహిమలుండడం కాదు. ఏదో శాస్త్రీయ ఆధారం ఉండే ఉంటుంది. నాకైతే తెలీదుగానీ వీరు తేలడానికి మహిమలైతే కారణం కాదు. ఎందుకంటే మహిమలు అంటూ ఎవరి దగ్గరా లేవు. వీళ్లు అందరిలాగా మునగట్లేదు. కానీ వీరు అందరికంటే భిన్నంగా ఉన్నారు. అదే తేడా. మునగకపోవ డానికీ వారికున్న ఊబకాయానికీ ఏదైనా సంబంధముందేమో! (హేతువు చూడగలగడం, ఆ హేతువు నిజ భౌతిక ప్రపంచపు పరిశీలనల ఆధారంగా ఏర్పడడం మనం ఇక్కడ చూస్తాము). ఇదే ప్రశ్నను శాస్త్రం తెలిసిన వ్యక్తి (ఉదా: జెవివి కార్యకర్త) ఇలా జవాబిస్తాడు. జెవివి కార్యకర్త: వీరు అందర్లాగా మునిగి పోలేదన్నది వాస్తవం. అందర్లాగే శరీరధర్మా లు ఉండడమూ వాస్తవమే. అయితే వీరు ఊబకాయులు. వీరి ఊబకాయానికి కారణం శరీరంలో పేరుకుపోయిన కొవ్వు. కొవ్వుకు నీటికన్నా తక్కువ సాంద్రత ఉంటుంది. కాబట్టి వీరి నికర సాంద్రత మిగిలినవారి సాంద్రత కన్నా కొంచెం తక్కువ. వీరి ఎముక నిర్మాణం అందర్లాగే ఉంటుంది. కాబట్టి వీపు మీద కొవ్వుతో కూడిన కండర కణజాలం వెన్నెముకకు అటూ యిటూ కాలవగట్టులాగా ఉంటుంది. వీరు బోర్లా కాకుండా జాగ్రత్తగా వెల్లకిలా నీటిపైన బల్లపరుపుగా పడుకో వడం వల్ల వీపుమీద ఉన్న గాడి (groove) కి, నీటికి మధ్య గాలిబుడగ ఏర్పడుతుంది. ఇది వారిని తేలేలా చేస్తుంది. పైగా వీరి సాంద్రత ఇతరులకంటే తక్కువ. ఈ రెండింటి ఫలితంగా వీరు ఈతకొట్టకున్నా తేలగలుగుతున్నారు. ఇదే వ్యక్తులు నిలువుగా నిల్చో లేరు. మునిగిపోతారు. బోర్లాపడుకొని తేలలేరు. మునిగి పోతారు. నేను ఛాలెంజ్‌ చేస్తాను. కావాలంటే ప్రయోగంచేసి చూడండి. మహిమలే ఉంటే వీరు ఏ భంగిమలో నీళ్లలో నిలబడ్డా మునగకూడదు. ప్రజల్లో ఉన్న పరిమితజ్ఞానాన్ని, అద్భుతాలపైగల విశ్వాసాల్ని ఆధారం చేసుకొని వారిని మోసం చేస్తూ కొందరు డబ్బులు కూడబెట్టుకొంటున్నారు. అలాగే సముద్రపు నీటిలో ఇలా తేలడం మరింత సులువు. దీనికి కారణం ఈ నీటిలో ఉప్పు శాతం ఎక్కువ వుండడంతో దీని సాంద్రత మామూలు నీటి కన్నా ఎక్కువగా ఉండటమే. అందుకే మృతసముద్రం (డెడ్‌ సీ)లో అక్కడి ప్రజలు ఇలాగే నీటిలో పడుకుని దినపత్రిక చదువుకుంటారంట. ఒకవైపు దేవుడి సృష్టి అద్భుతం, అందమైన విశ్వం అంటూనే వారానికి రెండు రోజులు మంచివికావని, దుర్ముహూర్తాలనీ, మంచిరోజులనీ, రాహూకాలమనీ, చెడ్డదిక్కులనీ, పదార్థాల, కాలాల ఆంతరంగిక లక్షణాలకు బయట ఉన్న సార్వత్రికత (universality) కు రంగుల్ని పూస్తారు. అశాస్త్రీయ కారణాల్ని హేతువులుగా చూపుతారు. పాఠ్యపుస్తకాల్లోనూ, తరగతిగదుల్లోనూ ఒకే విధమైన ప్రకృతి సూత్రాల్ని నేర్చుకొనే విద్యార్థులందరికి ఆ ప్రకృతిసూత్రాల పరిజ్ఞానంతో అబ్బవలసిన హేతువాద దృక్పథం, శాస్త్రీయ తత్పరతకన్నా అధికమోతాదులో అజ్ఞానాన్ని, అంధకారాన్ని, భయాన్ని, ఆందోళనలనూ, అభద్రతనూ, అశాస్త్రీయతనూ, అసమానతా భావాలనూ, ఛాందస త్వాన్నీ, వివక్షనూ, వైషమ్యాల్నీ నేర్పించే పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. తరగతిగదుల్లోనూ సరైన శాస్త్రీయ విద్య ఉండడం లేదు. పాఠాలు బోధించే సైన్సు టీచర్లలో చాలామందికి వాస్తు, జ్యోతిష్యం, బాబాల భక్తి, మహిమలు, మంత్రతంత్రాలు, పునర్జన్మ, కర్మ, ముహూర్తాలు, జాతకాలు అంటూ మూఢవిశ్వాసాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయోగశాలల్లేని సైన్సు తరగతిగదుల్లో శాస్త్రీయవిద్య ఎలా వీలు పడుతుంది? బడిలో చేరకముందే భయాలనూ, దయ్యాలనూ పరిచయం చేసే కుటుంబ సామాజికవ్యవస్థలో మనం ఉన్నాము. అందుకే వృత్తిపరంగా ద్రవ్యశక్తి నితృత్వ సూత్రాన్ని ప్రబోధించే భౌతికశాస్త్ర ప్రొఫెసర్లే సత్యసాయిబాబా శూన్యం నుంచి బంగారు నగల్ని సృష్టించడాన్ని ప్రశ్నించడం లేదు. పైగా అది మహిమ అంటూ శ్లాఘిస్తున్నారు. ఈ విశ్వంలో కొలతలకు వీలుగాని అంశం అంటూ ఏదీ లేదు. ఏ దృగ్విషయమైనా ద్రవ్యరాశి (mass), స్థలం (space), కాలం (time), విద్యుత్ప్రవాహం (current) అనే అక్షరమాలలో ఒదగాల్సిందే. కానీ 'మహిమ' అనే రాశికి ఏ కొలతలుండవు. కాలం ఉండదు. స్థలం ఉండదు. సంఖ్యామానం ఉండదు. ప్రయోగ నిర్ధారణ కూడా ఉండదు. వేదనను మర్చిపోవడానికి పేదవాడు ఏదో ఒక ఆధారాన్ని ఆసరా చేసుకొని సంభాళించు కొంటాడు. పాలకోసం ఏడ్చే పసిబిడ్డకు పాలకు బదులు ప్లాస్టిక్‌ పీకను నోటికిచ్చి, దాన్నే తల్లిపాలిండుగా భావించమంటూ మోసం చేసినట్లే సర్వజ్ఞానానికీి, సుఖసంతోషాలకూ, సంపూర్ణ మానవీయ వికాసానికీ అర్రులు చాచే ప్రజాబాహుళ్యానికి మూఢవిశ్వాసాలనూ, ఛాందసత్వాన్నీ, కర్మవాదాన్నీ దోపిడీవర్గం అలవాటు చేసి, అందులోనే సుఖప్రాప్తి పొందమంటూ మోసం చేస్తుంది