Wednesday 25 January 2012

మాయలు మహిమల బండారం

మాయలు మహిమల బండారం Share 6 విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 30 Nov 2011, IST మాయలు, మహిమల పేరుతో కొంత మంది బాబాలు, స్వామీజీలు మోసం చేస్తుంటా రు. వాటినిచూసి వారి దగ్గర ఏదో అతీంద్రీయశక్తులు ఉన్నాయని నమ్మి మోసపోతుంటాం. మహిమల వెనుకున్న గుట్టు, రహస్యాలు తెలియనంతకాలం వాళ్ళ దగ్గరేవో శక్తులున్నాయని అనుకుంటాం. తెలిసిన తరువాత 'ఇంతేనా' అనుకుంటాం. అలాంటి మాయల రహస్యాలను, దానిలో ఇమిడి వున్న శాస్త్రవిజ్ఞానాన్ని కొన్నింటిలో పరిశీలిద్దాం. నిప్పుల మీద నడక.. కొంతమంది నిప్పుల మీద నడుస్తారు. మహిమ వలన కాలదని చెపుతారు. మహిమ గల వారే నడవాలని చెపుతారు. నిజంగా మహిమకలవారే నడవాలా? ఎవరైనా నడవవచ్చు. ఇందుకు ఏ మహిమా అవసరం లేదు. సైన్స్‌ తెలిసుంటే చాలు. ఏ పదార్థానికైన కొన్ని ధర్మాలుంటాయి. ఏ వస్తువు పొయ్యి మీద పెట్టగానే వేడెక్కదు. అందుకు కొంత సమయం పడుతుంది. అలాగే మన కాలు నిప్పుమీద పెట్టగానే వెంటనే కాలదు. కొన్ని సెకన్ల సమయం పడు తుంది. నిప్పుమీద కాలు ఆనగానే కొంత భయం ఏర్పడుతుంది. దానివలన చెమ టపడుతుంది. అందువలన కాలదు. అయితే ఆ కొద్ది సెకన్ల కాలంలోనే మనం అడుగుతీసి అడుగువేయాలి. అందుకు నిప్పులపై వేగంగా నడవాలి. అంతేకానీ మాయ మహిమ అనేవేమీ లేవు. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనుభవజ్ఞు లైన వారు లేకుండా ప్రయత్నించరాదు. నిప్పుల మీద బూడిద లేకుండా చూసు కోవాలి. వేగంగా నడవాలి. భయపడి మధ్యలో ఆగరాదు. ధైర్యంగా ఉండాలి. నీటితో మంటలు.. ఒక స్వామీజీ నా మహిమ చూడండి నేను నీటితో మంటలను మండిస్తానని చెప్పాడు. అందరు ఎలా మండిస్తాడోనని చూస్తున్నారు. నడవండని అందరినీ బయటకు తీసి కెళ్ళాడు. కాసేపు అటూ ఇటూ తిప్పి ఆగండి అన్నాడు. మీ దగ్గర ఎవరి దగ్గరన్నా నీళ్ళున్నాయా? అని అడిగాడు. ఒకరిద్దరు తమ దగ్గరున్న నీళ్ళ బాటిల్స్‌ ఇవ్వబోయారు. మీరే ఆ నీళ్ళను ఈ భూమిపై పోయమని చెప్పాడు. వాళ్ళు అలాగే పోశారు. వెంటనే ఒక అగ్గిపుల్లతో అక్కడ మంట పెట్టాడు. ఆశ్చర్యం మంట వస్తుంది. నీళ్ళుపోస్తున్న కొద్దీ పెరుగుతుందే కానీ తగ్గడంలేదు. చూశారా నా మహిమ అంటూ అందరివైపు ఒక్కసారి చూశాడు. అంతే అందరూ 'స్వామీ!' అంటూ ఆయన కాళ్ళమీద పడ్డారు. ఈ మహిమ ఏంటో చూద్దామని వెళ్ళాం. పరిశీలన తరువాత మాకు తెలిసింది ఏమిటంటే ముందుగానే ఆ భూమిలో కాల్షియంకార్బైడ్‌ అనే రసాయనాన్ని అతని సహాయకులు ఉంచారు. అక్కడికి రాగానే వారు సైగ చేశారు. అక్కడే నీళ్ళు పోయమన్నా డు. నీళ్ళు పోయగానే రసాయన ప్రక్రియ జరిగి ఎసిటిలీన్‌ అనే వాయువు విడుదలవుతుంది. ఈ వాయువుకు మండే లక్షణం ఉంది. అందుకే మండించగానే ఈ వాయువు మండుతుంది. నీళ్ళు పోస్తున్న కొద్దీ వాయువు వస్తుంది. మంట మండుతూనే ఉంటుంది. ఇళ్లు తగలబడడం.. ఊర్లో ఎవరో చేతబడి చేశారని, మంత్రాలు చేశారని ఇళ్లు తగులబడుతున్నాయని అనేకసార్లు పత్రికల్లో వార్తలు చూస్తున్నాం. ఇలాంటి అనేక గ్రామాలను జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు పరిశీ లించడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో పచ్చభాస్వరం అనే రసాయన పదార్థాన్ని వినియో గిస్తారని గుర్తించాం. పచ్చభాస్వరంను నీటిలో భద్రపరుస్తారు. నీటిలో నుండి బయటకు తీయగానే భగ్గున మండుతుంది. దీనిని తడిగుడ్డలో చుట్టి ఇళ్ల మీద పడేస్తే లేదా చూరులో పెడితే తడి ఆరిన తరువాత పచ్చభాస్వరం మండుతుంది. ఆ మంటతో ఇళ్లు తగలబడతాయి. ఇదీ దీనిలోని అసలు సంగతి. అంతేగానీ చేతబడి, మంత్రాలు కారణంకానే కాదు.

No comments: