Wednesday 25 January 2012

స్క్రూగేజి కనీస కొలత అంటే ?- పదో తరగతి భౌతికరసాయన శాస్త్రం

స్క్రూగేజి కనీస కొలత అంటే ? Share జి.బాలసుబ్రహ్మణ్యం Thu, 12 Jan 2012, IST పదో తరగతి భౌతికరసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం-బేధాలకు సంబంధించిన ప్రశ్నలు 1. ఆల్ఫా, బీటా, గామా, కిరణాల మధ్య తేడాలు రాయుము. 2. ద్రవ్యరాశి, భారానికి గల తేడాలు రాయండి. 3. డయా, పారా, ఫెర్రో అయస్కాంత పదార్థాల మధ్య తేడాలు రాయండి. 4. సూర్య కేంద్రక సిద్ధాంతం, భూకేంద్రక సిద్ధాంతం మధ్య గల తేడా రాయండి. 5. అభికేంద్ర బలం, అపకేంద్ర బలానికి మధ్య తేడాలు రాయండి. 6. పురోగామి తరంగాలు స్థిరతరంగాలు మధ్య తేడాలను రాయండి. 7. న్యూటన్‌ కణ సిద్ధాంతం, హైగెన్స్‌ తరంగ సిద్ధాంతముల తేడాలను రాయండి. 8. సాధారణ కాంతికి, లేజర్‌ కాంతికి గల బేధాలను వివరించండి. 9. సహజ రేడియో ధార్మికత, కృత్రిమ రేడియో ధార్మికతల మధ్య తేడాలను రాయండి. 10. Aజ, ణజ లతో పనిచేసే మోటారులలో తేడాలను వివరించండి. 11. గురుత్వ త్వరణానికి, విశ్వ గురుత్వ స్థిరాంకానికి మధ్య గల సంబంధాన్ని ఉత్పాదించండి. 12. యంత్ర భాష, ఉన్నత స్థాయి భాషల మధ్య తేడాలను రాయండి. 13. కంప్యూటర్‌లో హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లకు మధ్య గల తేడాలను రాయండి. ప్రయోగాలకు సంబంధించిన ప్రశ్నలు 1. రిపిల్‌ ట్యాంక్‌ ఉపయోగించి తరంగాల పరావర్థనం మరియు వక్రీభవనాన్ని వివరింపుము. 2. ఫారడే రెండవ విద్యుత్‌ విశ్లేషణ నియమాన్ని ప్రయోగం ద్వారా వివరించండి. ఏవేని రెండు విద్యుత్‌ విశ్లేషణ అనువర్తనాలను రాయండి. 3. రూథర్‌ఫర్డ్‌ ఆల్ఫా కణాల పరిక్షేపణం చూపు పటాన్ని గీచి దాని ప్రాముఖ్యతను ప్రస్తావించండి. 4. పటం ద్వారా రేడియో ప్రసారంలో వివిధ దశలను వివరించడం. 5. లఘు లోలకంతో ఒక ప్రాంతపు గురుత్వ త్వరణాన్ని నిర్ధారించే ఒక ప్రయోగాన్ని వివరించండి. 6. గాలిలో ధ్వని వేగాన్ని తెలుసుకోవడానికి ఒక పద్ధతిని వివరించండి. 7. ఓమ్‌ నియమాన్ని రాసి, ఋజువు చేయడానికి ఒక ప్రయోగాన్ని వర్ణించండి. 8. కంప్యూటర్‌ యొక్క దిమ్మెల రూపు చిత్రాన్ని గీసి వివరించండి. 9. లేజర్‌ పనిచేసే విధానాన్ని వివరించండి. 10. న్యూక్లియర్‌ రియాక్టర్‌ ఏ సూత్రం పై ఆధారపడి పని చేస్తుంది. అది పనిచేయు విధానాన్ని వివరించండి. 11. ఈవింగ్‌ అయస్కాంత అణు సిద్ధాంతంలోని మౌలిక భావనలు ఏవి? దాని వైఫల్యానికి కారణాలు రాయండి. 12. స్క్రూగేజి ఉపయోగించి తీగ యొక్క వ్యాసము ఎలా కనుగొంటారు. 13. ుV ప్రసారంలోని వివిధ దశలను పటం ద్వారా వివరించండి. 14. ట్రాన్సిస్టర్‌ అనగా ఏమి? రెండు రకాల ట్రాన్సిస్టర్‌లను పటం ద్వారా విశదీకరించండి. ఉపయోగాలు మరియు ఇతర ప్రశ్నలు 1. సరళ హరాత్మక చలనం లక్షణాలు రాయండి. 2. లాండ్రి డ్రైయర్‌ పనిచేయు విధానాన్ని వివరించండి. 3. జంక్షన్‌ డయోడ్‌ యొక్క ధర్మాలు, ఉపయోగాలను రాయండి. 4. వాలు బయాస్‌లో, ఎదురు బయాస్‌లో పి-ఎన్‌ జంక్షన్‌ డయోడ్‌ చక్కని పటాలు గీయండి. 5. రోడ్డు మార్గాలకు గట్టుకట్టవలసిన అవసరం ఏమిటి? 6. విజ్ఞానపరంగా, సాంకేతికంగా లేజర్‌ యొక్క ముఖ్య అనువర్తణాలేవి? 7. ఉపకేంద్ర యంత్రం అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? 8. వైద్యరంగంలో లేజర్‌ ఉపయోగాలు 9. ఫారడే మొదటి, రెండవ విద్యుత్‌ విశ్లేషణ నియమాలను రాయండి. 10. జంక్షన్‌ ట్రాన్సిస్టర్‌ ధర్మాలు, ఉపయోగాలు రాయండి. ఐదు మార్కుల పటము (భౌతిక శాస్త్రం) 1. స్క్రూగేజి 2. దండాయస్కాంత ఉత్తరధ్రువం భౌగోళిక ఉత్తర దిశలో ఉంచినప్పుడు అయస్కాంత బల రేఖలను గీచి తటస్థ బిందువులను గుర్తించండి. 3. టి.వి. ప్రసారం మరియు రేడియో ప్రసారం పటాలు. 4. న్యూక్లియర్‌ రియాక్టర్‌ 5. దండాయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం, భౌగోళిక ఉత్తర ధ్రువాన్ని చూస్తున్నప్పుడు ఏర్పడే బలరేఖల పటాన్ని గీయండి. తటస్థ బిందువులను గుర్తించండి. 6. ఉష్ణ యాంత్రిక తుల్యాంకము కనుగొను ప్రయోగంలో పరికరముల అమరికను గీయండి. 7. విద్యుత్‌, అయస్కాంత్‌ వర్ణపటం గీచి వివిధ తరంగాల తరంగధైర్ఘ్యాలను గుర్తించండి. 8. ట్రాన్స్‌ ఫార్మర్‌ పటం 9. విద్యుత్‌ మోటార్‌ పటం 10. డైనమో పటం రసాయన శాస్త్రం 11. ఆల్కాహాల్‌ తయారీలో గల పరికరాల అమరికను చూపు పటం గీచి భాగాలు గుర్తించండి. 12. స-ఆర్బిటాళ్లు, జూ-ఆర్బిటాళ్లు ర-ఆర్బిటాల్‌ 13. చక్కెర పరిశ్రమలో చెరకు, నుండి చక్కెర తయారు చేయు పటం, 14. నూనెల హైడ్రోజనీకరణం 15. సిమెంట్‌ తయారీ 16. మెగ్నీషియంను దాని ధాతువు నుండి సంగ్రహించడాన్ని సూచించే పటాన్ని గీచి భాగాలను గుర్తింపుము. 17. నైట్రోజన్‌ అణువుతో త్రిక బంధం ఏర్పడుటను సూచించే రేఖా చిత్రం గీయండి. 18. ఆక్సిజన్‌ అణువుతో ద్విబంధం ఏర్పడుటను సూచించే రేఖా చిత్రం గీయండి. 19. ఆర్బిటాళ్ల వివిధ శక్తిస్థాయిలను తెలుపు అయిలర్‌ పటమును గీయండి. 20. ష్ట్రషశ్రీ అణువు ఏర్పడు ఆర్బిటాళ్ల అచ్చాదన పటం గీయము. 21. సిగ్మా బంధం, పై బంధాలను ఏర్పడు విధానం తెలుపు పటాలను గీయండి. 22. డైమండ్‌, గ్రాఫైట్‌ పటాలను గీయండి. 1 మార్కు ప్రశ్నలు - భౌతిక శాస్త్రం 1. 20 మీ. ఎత్తునుండి పడే వస్తువు భూమిని తాకినపుడు దాని వేగమెంత? 2. అనునాదం నిర్వచించండి. 3. అయస్కాంత భ్రామకం అనగా ఏమి? 4. ఐసోటోప్‌లు అంటేఏమిటి? ఉదాహరణలు ఇమ్ము. 5. ఐసోబార్‌లు అంటే ఏమిటి? 6. ఐసోటోన్‌లు అంటే ఏమిటి? ఉదాహరణ ఇమ్ము. 7. సూర్యకేంద్రక సిద్ధాంతం అనగా ఏమి? 8. ఒక బంతిని పైకి విసిరినప్పుడు అది చేరిన గరిష్ఠ ఎత్తు 80 మీ దాని తొలివేగమెంత? 9. ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడానికి కావల్సిన నియమం ఏమిటి? 10. రేడియో ధార్మిక విఘటన నియమాన్ని రాయండి. 11. హుక్‌ సూత్రాన్ని రాయండి. 12. ద్రవ్యరాశి లోపాన్ని నిర్వచించండి. 13. బైట్‌ అనగాఏమి? 14. రేడియోగ్రఫీ అంటే ఏమిటి? 15. లెంజ్‌ నియమాన్ని నిర్వచించండి. 16. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏ సూత్రమాధారంగా పని చేస్తుంది. 17. బంధన శక్తి అంటే ఏమిటి?; 18. జూ-అ-జూ ట్రాన్సిస్టర్‌ సంకేతాన్ని గీయండి. 19. కఠిన ఞ- కిరణాల ఉపయోగమేమిటి? 20. స్క్రూగేజి కనీసపు కొలత అనగా ? 21. అనునాదానికి నిత్య జీవితంలోని రెండు ఉదాహరణలను రాయండి. 22. హీలియం న్యూక్లియర్‌ పటం గీయండి. 23. స్క్రూగేజి శూన్యాంక దోషాలు పటం గీయండి. 24. నిత్య జీవితంలో మీకు తెలిసిన డోలాయమాన చలనాలకు ఉదాహరణ ఇవ్వండి. 25. వాతావరణంలోని ఓజోన్‌ పొర క్షిణించడానికి కారణాలు ఏమి? 26. గమన కాలం అనగానేమి? 27. స్థావర తరంగాలు పటం గీయండి. 28. ఒక సాధారణ విద్యుత్‌ పటం గీయండి. 29. పరమాణు సంఖ్య మరియు పరమాణు ద్రవ్యరాశికి గల బేధమును రాయము. 30. మాదీకరణం అనగా ఏమిటి? 31. విద్యుత్‌ అయస్కాంత తరంగం పటం గీయండి. 32. కృత్రిమ పరివర్తన అంటే ఏమిటి?

No comments: